రెండు తెలుగు రాష్ట్రాలలో పేరుకే వైసీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఉన్నాయి. వాస్తవానికి ఇక్కడ కూడా బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే పార్టీలు నడుస్తున్నాయి అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టంచేశారు. ‘రాష్ట్రాన్ని రక్షించండి- దేశాన్ని కాపాడండి’ నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... కేంద్రంలో మోదీ ఎంత ప్రమాదమో తెలుగు రాష్ట్రాలలో జగన్, కేసీఆర్ అంతే ప్రమాదం. ఈ మూడు పార్టీలను ఓడించేలా సీపీఐ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. లిక్కర్ కేసులో శరత్‌చంద్రారెడ్డిని అప్రూవర్‌గా మార్చి, కవితను ఇరికించారు. దీంతో కేసీఆర్ బయపడ్డాడు అని వ్యాఖ్యానించారు.