గజరాజులు సంచరిస్తున్న పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం అటవీ శాఖ రేంజర్ త్రినాధ రావు అన్నారు. ఆదివారం కొమరాడ మండలం అర్తం గ్రామ సమీపంలోని పంట పొలాలలో ఏడు ఏనుగుల గుంపు సంచరిస్తుండగా ఒంటరి ఏనుగు హరి ముంపు దుగ్గి ప్రాంతంలో ఉన్నట్లు చెప్పారు. సమీప ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏనుగులను కవ్వింపు చర్యలు చేపట్టరాదన్నారు.