కడప జిల్లా, వాల్మీకిపురం పోలీసులు వివిధ దొంగతనం కేసుల్లో ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్ళితే..... వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామం బజారువీధికి చెందిన వెంకటరమణయ్యశెట్టి నివాసంలో గతేడాది డిసెంబరు 21 అర్థరాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఏడాది జూలై 29న కలికిరి అమర నాథరెడ్డి కాలనీకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని రాదెమ్మ నివాసంలో దొంతదనాలకు పాల్పడి బంగారు నగలు అపహరించుకుపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా నిందితులు వాల్మీకిపురం మండల వాసులుగా తేలింది. మండలంలోని మేకలవారిపల్లెకు చెందిన మేకల గుర్రప్ప(60), మేకల హరివేంద్ర(22), మేకల దేవేంద్ర(25)లు చోరీలలో నిందితులుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. శనివారం రాత్రి ముగ్గు రు నిందితులు మండలంలోని విఠలం బస్టాండు సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో సీఐ సురేష్‌కుమార్ సిబ్బం దితో దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 370గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకుని ఓ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచారు.