ప్రతిష్టాత్మక జీ20 సదస్సుకు రాలేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఈ మేరకు భారత ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ కాల్ ద్వారా ఈ విషయం వెల్లడించినట్లు ప్రకటనలో తెలిపారు. తనకి బదులు రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్ ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపింది. కాగా, ఢిల్లీలో వచ్చే నెల 9-10 తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది.