రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ జమ్మూకశ్మీర్ లో నివసించని పౌరుల ప్రాథమిక హక్కులను లాగేసుకుందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. రాష్ట్రేతరులకు ప్రాథమిక హక్కుల నుంచి దూరం చేసిందన్నారు. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370తో పాటు 35ఏను కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 2019లో రద్దు చేసింది.