చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత ఇస్రో సూర్యుడి వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి సిద్ధమవుతోంది. శనివారం ఉదయం 11:50 గంటలకు శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. దీనికి సంబంధించి లాంఛ్ రిహార్సల్, రాకెట్ అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని బుధవారం ట్వీట్ చేసింది. ఈ మిషన్ సూర్యుడి లెగ్రాంజ్ పాయింట్ సమీపంలోని కక్ష్యంలోకి 7 పేలోడ్స్ తీసుకెళ్తుంది. ఈ సందర్భంగా ఫోటోలను ఇస్రో పంచుకుంది.