5-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారులను తప్పక బడిలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం రాయచోటి కలెక్టరేట్ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పై మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ పరిధిలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే 100 శాతం పూర్తి చేయాలన్నారు.