పులివెందుల జయమ్మ కాలనీలో బుధవారం డాక్టర్ జీవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటా ఫీవర్ సర్వే, లార్వా సర్వే నిర్వహించారు. మలేరియా డెంగ్యూ వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. డాక్టర్ మాట్లడుతూ. జ్వరాలు వచ్చినట్లయితే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య మాట్లడుతూ ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రైడే పాటించాలని, పనికిరాని, వస్తువులను ఇంటి పరిసరాలలో లేకుండా చూడాలన్నారు.