తిరుపతిలో మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తిరుపతి ఈస్ట్ పోలీసులు పరిధిలోని కొర్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు చిన్ని అలియాస్ పుష్ప(37)గా పోలీసులు గుర్తించారు. పుష్ప భర్త గుణశేఖర్ మూడు సంవత్సరాల క్రితం కరోనాతో మృతి చెందాడు. కొర్లగుంటలో ఒంటరిగా ఉన్న పుష్ప చంద్రగిరి మండలం నరసింగాపురంకు చెందిన దిలీప్‌తో సహజీవనం చేస్తోంది. తమిళనాడు రాష్ట్రం, కడలూరు జిల్లా నైవేలి, టీటీడీ కళ్యాణ మండపం మేనేజర్‌గా దిలీప్ ఉద్యోగం చేస్తున్నారు. అయితే దిలీప్‌కు పెళ్లి కుదిరిందని విషయం తెలుసుకొని పుష్పా అతనిని నిలదీసింది. దీంతో ఇరువురు మద్య ఘర్షణ చోటు చేసుకోగా... పుష్ప తలకు గాయాలయ్యాయి. వెంటనే పుష్పను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. గాయం నయం కాకపోవడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా అప్పటికే పుష్ప మృతి చెందింది. విషయం తెలుసుకున్న పుష్ప తమ్ముడు మహేష్ తిరుపతికి చేరుకుని ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.