ఏపీఎండీసీ కార్యాలయంలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇసుక అక్రమ క్వారీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ కార్యాలయాన్ని ముట్టడించి టీడీపీ నేతలు.. మైనింగ్, ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఇసుక అక్రమాలపై తెలుగుదేశం నేతల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు ఎండీ అందుబాటులో లేరని అధికారుల సమాధానమిచ్చారు. ఎండీ వెంకట్ రెడ్డి సెలవులో ఉన్నారని అధికారులు వివరించారు. తమ ఫిర్యాదు తీసుకునే ఉన్నతాధికారులు రావాలంటూ కార్యాలయం వద్దే తెలుగుదేశం నేతల బైఠాయించారు. ఏపీఎండీసీ కార్యాలయానికి పెద్దఎత్తున పోలీసులు చేరుకున్నారు.