ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ సరిహద్దుల్లో కొనసాగుతోన్న చైనా ఆగడాలు,,,దెప్పాంగ్ మైదానాలకు సమీపంలో నిర్మాణాలు

national |  Suryaa Desk  | Published : Wed, Aug 30, 2023, 08:59 PM

పొరుగు దేశం చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ భూభాగాలైన అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయి చిన్‌లను తమవిగా పేర్కొంటూ చైనా కొత్త మ్యాప్‌ను సోమవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, భారత భూభాగంలో చైనా సొరంగాలు, బంకర్లు నిర్మిస్తోన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తర లడఖ్‌లోని దెప్సాంగ్ మైదానానికి తూర్పున అరవై కిలోమీటర్ల దూరంలో సైనికులు, ఆయుధాల కోసం బహుళ పటిష్ట ఆశ్రయాలు, బంకర్ల నిర్మాణానికి చైనా దళాలు ఇరుకైన నదీ లోయతో పాటు కొండపైకి సొరంగాలు, భూగర్భ పనులు ప్రారంభించినట్టు అమెరికాకు చెందిన మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.


డిసెంబర్‌ 2021 నాటి అక్సాయ్‌చిన్‌ రీజియన్‌ ఫోటోలు.. ఈ ఏడాది ఆగస్టు 18న అదే రీజియన్‌లో పలు నిర్మాణాలతో కూడిన ఫోటోలను మాక్సర్ విడుదల చేసింది. అంతర్జాతీయ భౌగోళిక- ఇంటెలిజెన్స్ నిపుణులు ఈ ఫోటోలను విశ్లేషించి నివేదికను విడుదల చేశారు. వాస్తవాధీన రేఖకు తూర్పున చైనా అక్రమించుకున్న చారిత్రకంగా భారత్ భూభాగామైన ఆక్సాయి చిన్‌ను ఈ నివేదికలో గుర్తించారు. ఈ ఫోటోలు గత కొన్ని నెలలుగా చైనా భారీ నిర్మాణ కార్యకలాపాలను వెల్లడిస్తున్నాయి. ఈ నిర్మాణాలు భారత్ వైమానిక, ఫిరంగిదళ దాడుల నుంచి సైనికులు, ఆయుధాలను రక్షించే అవకాశం ఉంది. ఇక, చైనా మ్యాప్ గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్‌లను చైనా కొత్త ప్రామాణిక మ్యాప్‌‌లో చేర్చడంపై మండిపడ్డారు.


‘తమది కాని భూభాగాలతో చైనా మ్యాప్‌లను బయటపెట్టి పాతపాటే పాడింది.. కేవలం భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను మ్యాప్‌లను ఉంచినంత మాత్రానదేనినీ మార్చదు. మన భూభాగం గురించి మా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. భూభాగం. అసంబద్ధమైన వాదనల వల్ల ఇతరుల భూభాగాలు మీవి కాలేవు’ అని జైశంకర్ అన్నారు. మరోవైపు, చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) చేపట్టిన దీర్ఘశ్రేణి నిఘా రాడార్లతో కూడిన మిలటరీ మౌలిక సౌకర్యాల విస్తరణ, అండర్‌ గ్రౌండ్‌ ఫెసిలిటీ, దాదాపు 250 హెక్టార్ల విస్తీర్ణంలో రహదారులు, నిర్మాణంలో ఉన్న పలు నిర్మాణాలు మాక్సర్‌ శాటిలైట్‌ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నిర్మాణాలన్నీ వాస్తవాధీన రేఖకు కేవలం 65 కిలోమీటర్ల పరిధిలో ఉండటం గమనార్హం.


భారత్ దూకుడుగా వ్యవహరించడంతో చైనా అక్సాయ్ చిన్‌లో ఇటువంటి చర్యలకు దిగినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘సరిహద్దుకు సమీపంలో భూగర్భ సౌకర్యాలను నెలకొల్పడం.. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా చైనా వ్యూహకర్తలు అక్సాయ్ చిన్‌లో భారత వైమానిక దళం ప్రస్తుత ప్రయోజనాన్ని సమతుల్యం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది’ అని ఇంటెల్‌ ల్యాబ్‌లోని ప్రముఖ నిపుణుడు డామియన్ సైమన్ చెప్పారు. ప్రముఖ భారతీయ డ్రోన్ స్టార్టప్ న్యూస్పేస్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీస్ సీఈఓ సమీర్ జోషి ‘గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత సైన్యం యుద్ధ సామాగ్రిని ముఖ్యంగా దీర్ఘ-శ్రేణి ట్యూబ్, రాకెట్ ఆర్టిలరీలను సరిహద్దుల్లో మోహరించింది.. చైనా చేపట్టిన నిర్మాణాలు భారత దాడి సామర్థ్యంతో నేరుగా ముడిపడి ఉంది’ అని ‘టిబెట్‌లో చైనా విస్తరణ కాంక్షను భారత్ అడ్డుకోవడంతో ప్రస్తుత ప్రమాదాన్ని తగ్గించడానికి పటిష్ట షెల్టర్‌లు, బంకర్‌లు, సొరంగాలు, రోడ్ల విస్తరణతో సహా భారీ నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి’ అని ఆయన వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa