అనంతపురం టూటౌన్ పోలీసుస్టేషన్లో వై.రమేష్ కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. అతడి భార్య కూడా కానిస్టేబులే. ఇద్దరూ నగరంలోని అరవిందనగర్‌లో నివాసముండేవారు. ఇంట్లో తమ పిల్లలను చూసుకోవడానికి జిల్లాలోని గుత్తి మండలం తురకపల్లికి చెందిన ఓ బాలికను పిలిపించుకొన్నారు. తనను గర్భిణి చేశాడని ఆ బాలిక చేసిన ఫిర్యాదు మేరకు గతనెల 5వతేదీన రమే్‌షపై టూటౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. అనంతరం కోర్టు విచారణలో భాగంగా మేజిస్ర్టేట్ ఎదుట ఒప్పుకోలు ప్రకటన (కన్ఫెషన్ స్టేట్మెంట్) తీసుకుంటున్న సందర్భంలో ఆ బాలిక మరోలా చెప్పుకొచ్చింది. తాను గర్భిణి కావడానికి గుత్తి మండలం తరకపల్లికి చెందిన వలంటీర్ రాజశేఖర్ కారణమని చెప్పింది. దీంతో అనంతపురం టూటౌన్ పోలీసులు మంగళవారం రాజశేఖర్‌ను అరెస్టు చేశారు.