శ్రీకాకుళం జిల్లా పరిధిలో వేర్వేరు చోట్ల పోలీసులు జరిపిన తనిఖీల్లో రూ.55 లక్షల విలువైన నకిలీ రూ.2 వేల నోట్లు పట్టుబడ్డాయి. ఈ ఎచ్చెర్ల ఎస్ఐ వి.సత్యనారాయణ మాట్లాడుతూ..... ముందస్తు సమాచారం మేరకు చిలకపాలెం జంక్షన్ వద్ద ఈ నెల 24న నిర్వహించిన తనిఖీల్లో దుంగ వీరమణికంఠ (తుని) నుంచి రూ.37 లక్షల విలువైన నకిలీ రూ.2 వేల నోట్లు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 29న సాయంత్రం పైడిభీమవరం వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో గనగళ్ల విజయకుమార్ (విజయనగరం), కంపనగారు వెంకటరెడ్డి (కర్ణాటక)లను పట్టుకుని రూ.17.98 లక్షల విలువైన నకిలీ రూ.2 వేల నోట్లు, కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ రెండు కేసుల్లో రూ.55 లక్షల విలువైన నకిలీ నోట్లు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు.