చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు. ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తామంటే వద్దని కేంద్రం నుంచి ప్యాకేజీ తెచ్చుకున్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పని చేసి ప్రజలకు ఏం చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఒక్క పథకాన్నైనా చంద్రబాబు సరిగ్గా అమలు చేశారా అని నిలదీశారు. లోకేష్ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నెల నెల లోకేష్‌కు రూ.500 కోట్లు ఇసుక ముడుపులు తీసుకునేవాడని విమర్శించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని టీడీపీ నేతలే తీసుకున్నారన్నారు. ఎన్జీటీ రూ.100 కోట్లు చంద్రబాబు హయాంలో జరిమానా వేసిందని గుర్తు చేశారు. మేం ఇసుక పాలసీని పారదర్శకంగా రూపొందించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.