భారత్ తొలిసారి ఆతిథ్యం ఇస్తోన్న జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరు కావడం లేదు. తనకు బదులుగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గెయ్ భారత్ వస్తారని పుతిన్ ప్రకటించారు. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సును సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీ వేదికగా నిర్వహించనున్నారు. జీ20 దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.