సమాజంలో కలిసిపోయి తిరుగుతున్న ఎనిమిది మంది ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్లో బలగాలు పట్టుకున్నాయి. స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA), క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) స్పెషల్ డ్రైవ్లో పరారీలో ఉన్న ఎనిమిది మంది గురువారం అరెస్టయ్యారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత టెర్రరిస్ట్, డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ (నివారణ) చట్టం కేసుల్లో నిందితులుగా ఉన్న వీరు ఎట్టకేలకు బలగాలకు చిక్కారు.