మహారాష్ట్రలోని కుర్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి ఒకేసారి మూడు వ్యాధులు సోకాయి. జ్వరంతో బాధపడుతున్న బాలుడిని అతడి తల్లిదండ్రులు కస్తూర్బా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల్లో డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిన్ అనే ఇన్ఫెక్షన్ బయటపడింది. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ముంబైలోని నాయర్ ఆస్పత్రికి తరలించారు. అయితే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.