రాష్ట్రపతి భవన్కు రాజకీయ రంగు పూశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి కుటుంబసభ్యులు హాజరుకావడంపై రాజకీయ రంగు పులమడం శోఛనీయమన్నారు. ఇది రాష్ట్రపతి హోదాను కించపరచడమేనని ఆమె ఆరోపించారు.