ఇసుకపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో ఇసుకను పెద్ద ఎత్తున దోపిడీ చేశారని విమర్శించారు. చంద్రబాబు 17 సార్లు ఇసుక పాలసీపై జీవోలు ఇచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు నివాసం ఉండే కరకట్ట వద్దే పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా చేశారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వనజాక్షిని కొట్టింది చంద్రబాబు హయాంలోనే కదా అన్నారు. వనజాక్షి, చింతమనేనిని చంద్రబాబు పిలిచి పంచాయితీ చేశారని ధ్వజమెత్తారు. వంశధార, నాగావళి, పెన్నాలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేశారని ధ్వజమెత్తారు.