ధర్మవరం పట్టణంలోని కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు ఆధ్వర్యంలో వారి స్వగృహంలో గురువారం జాతీయ నేత్రదాన పక్షోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేత్ర దానంతో మరో ఇద్దరికి కంటి వెలుగును ప్రసాదించవచ్చునని, మరణానంతరం ప్రతి ఒక్కరూ కళ్ళు దానం చేసేలా నిర్ణయాన్ని తీసుకోవాలని తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థలకు, యువతి యువకులకు, విద్యార్థులకు నేత్రదానం పై అవగాహన కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa