అనంతపురం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు దోహదపడే 20 నూతన బ్యారికేడ్లను గురువారం నాగార్జున సిమెంట్ సంస్థ ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు. ఆ కంపెనీ సేల్స్ ఆఫిసర్ వినోద్ కుమార్ రెడ్డి, సీనియర్ మేనేజర్ సాంబ శివారెడ్డిలు వీటిని ట్రాఫిక్ సి. ఐ వెంకటేష్ నాయక్ కు అందజేశారు. యాజమాన్యానికి జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు, డీఎస్పీ ప్రసాదరెడ్డిలు కృతజ్ఞతలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa