ప్రకాశం జిల్లా రాచర్ల మండల పరిధిలోని యడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8. వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు అవసరమైన స్టడీ మెటీరియల్స్ ను యశ్వంత్ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ మొర్రి పిచ్చయ్య గురువారం అందజేశారు. దాత పిచ్చయ్య మాట్లాడుతూ విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకోని వివిధ రకాల పోటీ పరీక్షలు వ్రాసి తమ ప్రతిభను నిరూపించుకోవాలన్నారు.