కంభం మండలంలోని జంగంగుంట్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏపి ఎన్జీసీ వారి ఆధ్వర్యంలో గురువారం యువమంతన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 9, 10 తరగతులు చదువుతున్న 20 మంది విద్యార్థులు జి-20 సదస్సులోని 20 దేశాల అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఆయా దేశాలలోని భౌగోళిక స్వరూపాలను, ఆర్థిక స్థితిగతులను ఆవిష్కరించి, వాతావరణ మార్పులు , వాటివలన కలిగే ప్రమాదాలు, నివారణోపాయాలను గురించి చర్చించారు.