గుంటూరు జిల్లాలోని ప్రతి కోర్టులో ఈనెల 9న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె. ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. గుంటూరు జిల్లాలోని సబ్ డివిజన్ల పోలీస్ అధికారులు, పోలీస్ స్టేషన్ల సీఐలతో గురువారం జిల్లా కార్యాలయం నుంచి జూమ్ వీడియో ద్వారా ఎస్పీ మాట్లాడారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సంయుక్తంగా కోర్టుకు హాజరై, కేసులు వీగిపోకుండా దోషులకు కోర్టులో శిక్ష పడేలా వ్యవహరించాలని ఆయన అన్నారు.