తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారానికి 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ..... అనంతపురం ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం దాకా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావ పాదయాత్రను అట్టహాసంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం ఎదుట తెలుగు యువత ఆధ్వర్యంలో నారాలోకేశ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, 200 టెంకాయలను కొట్టారు. టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో పాతూరులోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఎదుట 200 టెంకాయలు కొట్టారు.