విజయనగరం జిల్లా, ఫరాంగ్ రూట్లో వస్తూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందని భోగాపురం వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే... విజయనగరం దాసన్నపేట, గొల్లవీధికి చెందిన మల్లేడు నారాయణ రావు(35) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. వ్యక్తి గత పనుల నిమిత్తం గురువారం ద్విచక్రవాహనంపై భీమిలి మండలం చిప్పాడ వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో భోగాపురం జాతీయ రహదారిపై రాంగ్రూట్లో వస్తూ విజయనగరం వైపు తిరిగే సమయంలో ఎత్తుబ్రిడ్జి డౌన్లో ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నాడు. ఘటనలో నారాయణరావు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి తల్లి దండ్రులు లక్ష్మి, వెంకటరావు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇంకా వివాహం కాలేదు. తండ్రి మల్లేడు వెంకటరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు.