జగన్‌రెడ్డి భస్మాసుర పాలనలో ప్రజలు అల్లాడుతున్నారని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం నాడు ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. 'బాబు షూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ' కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కోరుతూ ఈ లేఖ రాశారు. రేపటి నుంచి 45 రోజులపాటు ఏపీవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ లేఖలో ఏముందంటే..’’ 45 రోజుల్లో 3 కోట్ల మందిని కలుసుకోవాలన్నదే నా లక్ష్యం.టీడీపీ అంటేనే సంక్షేమం, ప్రగతి.సైకిల్ రెండు చక్రాల్లో ఒకటి సంక్షేమం, మరొకటి అభివృద్ధి.వైసీపీ పాలకులు ఏపీని సర్వనాశనం చేశారు.నాడు అద్భుతంగా పురోగమించిన రాష్ట్రం.. నేడు అధ:పాతాళానికి పడిపోయింది. ప్రభుత్వ దోపిడీతో పేదలు మరింత పేదలుగా మారారు. సహజ వనరులు, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను దోచేస్తూ..సైకో ప్రభుత్వం ప్రజల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టింది. వైసీపీ మాఫియా రాజ్యంలో ప్రజల భవిష్యత్ నాశనమైంది. ఏపీలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకే.. 'భవిష్యత్‌కు గ్యారెంటీ' పేరుతో పథకాలు తెచ్చా.రేపటి నుంచి 45 రోజులు ఏపీవ్యాప్తంగా ప్రచారం చేస్తాం. పథకాల ప్రయోజనాలపై కార్యకర్తలు ప్రజలతో చర్చిస్తా.మీ సమస్యలపై వారితో చర్చించండి. రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీతో కలిసి అడుగులు వేయండి. దసరా రోజున సమగ్ర మేనిఫెస్టో ప్రకటిస్తా.అందరి భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేద్దాం.మీ ప్రాంతాలకు వచ్చే కార్యకర్తలకు సహకరించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.