తెలుగుదేశం పార్టీకి గుంతకల్లు నియోజకవర్గం కంచుకోట. బడుగు, బలహీన వర్గాలకు పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఓటమి ఉండకూడదు. నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. విభేదాలు వీడి పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టండి’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆ నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్, ముఖ్యనాయకులు కేసీ హరి, బండారు ఆనంద్, రవిశంకర్ గౌడ్, రామకృష,్ణ ముసలరెడ్డి, బద్రీవలి, రాఘవేంద్రతోపాటు క్లస్టర్ ఇనచార్జిలతో గురువారం చంద్రబాబు సమావేశమయ్యారు. వారికి పలు ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గంలో వర్గవిబేధాలకు తావు లేకుండా సమష్టిగా పనిచేయాలని అన్నారు. నాయకులందరూ పార్టీ శ్రేణులను కలుపుకొని పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు.