అనంతపురం జిల్లాలో జంప్ రోప్ ఎంపిక పోటీలు 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా జంప్ రోప్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రం అశోక్ నగర్లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు తమతో పాటు ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్ ను వెంట తీసుకుని రావాలని సూచించారు.