తాడిపత్రి పట్టణ పరిధిలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నందు పట్టణానికి సంబంధించిన ఇంటి పట్టాల లబ్ధిదారులతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో మంజూరు చేసిన ఇంటి పట్టాలలో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి అందజేస్తోందని మీరు అందరూ ఇళ్ళ నిర్మాణంలో భాగస్వామ్యులై ఇళ్ళ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేసుకోవాలని వారికి సూచించారు.