పెద్దపప్పూరు మండలంలో జాతీయ పౌష్టికాహర మహోత్సవాల ఐసిడిఎస్ అధికారులు శుక్రవారం నిర్వహించారు. మండలంలోని ముచ్చుకోట, పసులూరు, అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాముఖ్యత పై క్షుణ్ణంగా వివరించారు. చిరు ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు ఆహార పదార్థాలలో విటమిన్స్ ఐరన్ కాల్షియం ఉంటాయని వాటిని కచ్చితంగా తినాలని అధికారులు సూచించారు.