తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు సరికావని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. సనాతన ధర్మంపై ఉదయినిధి స్టాలిన్ వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయన్నారు. సీపీఎం రాజ్యసభ సభ్యుడు వెంకట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని.,. కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారని.. కాంగ్రెస్ ఎలా దీనికి మద్దతు తెలుపుతుందని ప్రశ్నించారు. హిందుత్వంపై దాడి ప్రారంభమైందన్నారు. సనాతన ధర్మంపై మాట్లాడే శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం ఒక కులానికి మతానికి చెందింది కాదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa