ధర్మవరం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మంగళవారం ప్లాస్టిక్ వాడకంపై పట్టణంలోని పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 15 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకొని, రూ. 3 వేలు జరిమానా విధించడం జరిగింది. ఇక నుండీ ప్రతిరోజు ప్లాస్టిక్ వాడకంపై తనిఖీలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు.