ధర్మవరం యూత్ బృందం ఆధ్వర్యంలో మంగళవారం ధర్మవరం మండలం గొట్లూరు అనాధ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తమ మిత్రుడు బాలగొండ్ల మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదానం చేశామని ధర్మవరం యూత్ బృందం తెలిపారు. అదేవిధంగా ఆశ్రమానికి ఒక బియ్యం బస్తా, వంట సరుకులు, తాగునీటి డ్రమ్ము తో పాటు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్, వినోద్, భాస్కర్, గణేష్, అనిల్, కిట్టు, తదితరులు పాల్గొన్నారు.