సత్య సాయి జిల్లా, పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద కమ్మవారిపల్లె నూతనంగా అర్హులైన పింఛన్దారులకు వైసిపి నాయకులు పింఛన్ పంపిణీ చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ, పింఛన్ జాబితాలలో కొత్తగా ఎంపికైన వారికి పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని, అర్హత ఉండే వారికి కచ్చితంగా లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రతాప్ నాయుడు, సతీష్ నాయుడు పాల్గొన్నారు.