మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హత్య చేసి మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని రాసారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనేక రకాలుగా అపవాదులు వేశారని... రివర్స్‌లో కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అంగళ్లలో తన మీద హత్యాప్రయత్నం చేసి పైగా తన మీదే 307 కేసు పెట్టారన్నారు. తాను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తడి చేస్తూ స్టేట్మెంట్ రాయిస్తున్నారన్నారు. యువగళంకు వచ్చి దాడులు చేసి వాళ్లపైనే కేసులు పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కరుడుగట్టిన సైకో అని... సైకో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. తమ పైన కేసులు పెట్టి లండన్‌లో ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో.. ఏం చేస్తున్నారో అంటూ చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు.