లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఉదయభాను, డాక్టర్ కేతన్‌పై తీవ్రమైన నేరారూపణలు ఉన్నాయని తెలిపారు. పరమ పవిత్ర తిరుపతి దేవస్థానంలో ఇలాంటి నేరచరిత్ర ఉన్నవారు ఉండటం భక్తుల మనోభావాలకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా ఉన్నాయంటూమాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు హైకోర్టులోప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తాత్కాలిక బెయిల్‌పై కొనసాగుతున్న నిందితుడిని తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ ప్రయోజనాలతో ఎన్నిక చేయటం చట్ట విరుద్ధమని పిటిషన్లో తెలిపారు. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ ఆకుల శేష సాయి జస్టిస్ రఘునందన్ రావు ధర్మాసనం ఈరోజు (బుధవారం) విచారించింది. పిటిషనర్ తరుపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రతివాదులుగా ఉన్న దేవదయ శాఖ కమిషనర్, తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ను ధర్మాసనం వివరణ కోరింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే బుధవారానికి (సెప్టెంబర్ 13) వాయిదా వేసింది.