మంగళవారం గురుపూజోత్సవం సభలో టీచర్స్‌ను ఉద్దేశించి మంత్రి ఆదిమూపు సురేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బైజూస్‌తో టెక్నాలజీ అంతా ట్యాబ్‌ల్లో వచ్చిందని.. గురువులు బదులు ఇప్పుడు గూగుల్ వచ్చిందని అన్నారు. గురువులకి తెలియనివి కూడా గూగుల్‌లో కొడితే తెలిసిపోతుందన్నారు. గూగుల్ వచ్చిన తరువాత గురువులు అవసరం లేదంటూ మంత్రి సురేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ.. గురువులు కన్నా గూగుల్ మిన్న అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ వాఖ్యలు అసంబద్దం, అర్ధ రహితమన్నారు. గురువులకు సన్మానం చేసారో లేదా అవమానం చేశారో మంత్రి తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.