2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి ముందు ఆంధ్రా ఆక్టోపస్‌గా ప్రసిద్ధి చెందిన లగడపాటి రాజగోపాల్ సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రం విడిపోదని, విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. రాష్ట్రం విడిపోవడంతో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి నిష్క్రమించారు. 2019 ఎన్నికల సమయంలో ముందస్తు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు.అయితే ఫలితాలు వచ్చిన తరువాత ఆయన అంచనాలు తప్పా యి. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన్ను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపాలని అనుచరులు కోరుతున్నారు. త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. లగడపాటి ఏ పార్టీలో ఉన్నా అభ్యంతరం లేదని ఆయనతో పాటే తామంతా అని నేతలు పేర్కొన్నట్లు సమాచారం.