యువగళం క్యాంప్ పై పోలీసుల దాడి చేయడంపై ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 205 రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు రక్షణగా నిలుస్తున్న వాలంటీర్ల అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. యువగళం శ్రేణులపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జగన్ రెడ్డి సైకో తర్వానికి అద్దం పడుతోందని వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న విషేశ స్పందనను చూసి అక్రమ కేసులతో ఆటంకాలు సృష్టించడం వైసీపీ దిగజార్చుడుతనానికి నిదర్శనమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు విఘాతం కల్పిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తామని తెలిపారు.