రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇసుకను దోచుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆరోపించారు. ఇసుక రీచ్‌ల నుంచి ప్రస్తుతం వస్తున్నవి దొంగ బిల్లులని, జీఎస్టీ కూడా కట్టడంలేదన్నారు. సీఎం నుంచి వైసీపీ ఎమ్మెల్యేలదాకా ఇసుక, మద్యం, మట్టిని దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, రోడ్లు గుంతలమయ మయ్యాయని అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, పన్నులు, కరెంటు బిల్లులతో ప్రజలను బాదేస్తున్నారని మండిపడ్డారు. దీనిని ఎదిరిస్తే ప్రజలపై పోలీసులను ప్రయోగించి, పోలీసు రాజ్యం నడుతుపున్నారని అన్నారు.