నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై దాడులు పధకం ప్రకారమే చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ పాదయాత్రతో వైసీపీ వెన్నులో వణుకుపుడుతోందని అందుకే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్రపై రాళ్ల దాడి చేసి అక్రమంగా కేసులు పెట్టారన్నారు. లోకేశ్ పాదయాత్రకు తగిన భద్రత కల్పించండి అని డీజీపీకి అనేక లేఖలు రాశామన్నారు. యువగళం పాదయాత్రను అక్రమంగా అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని.. ఎంత వరకు అయినా వెళతామని బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు.