అగ్రరాజ్యం అమెరికాను ప్రమాదకర బ్యాక్టీరియా వణికిస్తోంది. ఆ దేశంలో విబ్రియో వల్నిఫికస్ అనే బ్యాక్టీరియా కేసులు పెరుగుతున్నాయి. దీని వల్ల ఈ ఏడాది 12 మంది మృతి చెందారు. దీనిపై సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ బ్యాక్టీరియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శరీరంపై ఉండే గాయాల ద్వారా ఇది మానవ శరీరంలోకి వెళ్తుందని, ఇది మాంసాన్ని క్రమంగా తినేస్తుందని పేర్కొంది.