ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో అక్కడక్కడా బయటపడుతున్న డెంగ్యూ కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 08, 2023, 02:05 PM

శ్రీకాకుళం జిల్లా, జి.సిగడాం పరిధిలోని ఆనందపురంలో డెంగ్యూ కేసు కలకలం రేపింది. గుంటూరు నుంచి స్వగ్రామం ఆనందపురం వచ్చిన ఓ వ్యక్తికి డెంగ్యూ లక్షణాలు కనిపించటంతో అతడిని రాజాం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ డెంగ్యూ ఉన్నట్టు వైద్యులు నిర్దారించినట్టు గురువారం జి.సిగడాం పీహెచ్‌సీ వైద్యాధికారులు పొన్నాడ హరితాశ్రీ, యశ్వంత్‌ తెలిపారు. దీంతో సిబ్బందితో గ్రామానికి చేరుకొని గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు.  ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa