ప్రముఖ కార్టూనిస్ట్ అజిత్ నినాన్ (68) కన్నుమూశారు. మైసూరులోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ మేనేజింగ్ ట్రస్టీ వీజీ నరేంద్ర వెల్లడించారు. అజిత్ కార్టూన్లు ఇండియా టుడేలో 'సెంట్రస్టేజ్' సిరీస్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియాలో 'నీనాస్ వరల్డ్' పేర్లతో ప్రచురించబడ్డాయి. రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో కీలక పాత్ర పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa