మొరాకో దేశంలో శుక్రవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం వల్ల 296 మంది చనిపోయినట్లు మొరాకో ఇంటర్నల్ మినిస్ట్రీ శనివారం తెలిపింది. 153 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిని ఆసుపత్రులకు తరలించామని పేర్కొంది. మర్రకేష్‌కు నైరుతి దిశలోని 71 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం 18.5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.