స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. చంద్రబాబు తరుపున ఈ కేసును వాదించడం కోసం సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లూథ్రాను రప్పించిన సంగతి తెలిసిందే. దీనిపై ‘‘కోట్ల రుపాయలిచ్చి ‘లూథ్రా’ ని తెచ్చినా.. పస లేకపోతే ‘పొన్నవోలు’ముందు బలాదూర్!’’ అని ట్వీట్ చేశారు.