స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏడాదిన్నర నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోందని తెలిపారు. స్కీమ్ రూపకర్త, దర్శకత్వం అంతా చంద్రబాబేనని, అందులో ఆయన పాత్రపై ఆధారాలున్నాయని చెప్పారు. అన్ని ఆధారాలతో సీఐడీ అరెస్టు చేసిందని పేర్కొన్నారు. నిన్నటి నుంచి నారా, నందమూరి కుటుంబాలు లెక్కలేనితనంగా వ్యవహరించాయని మండిపడ్డారు.