నేను నిప్పు అని చెప్పుకుంటున్న చంద్రబాబును నమ్మెద్దు అని, తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని, న్యాయం గెలుస్తుందని చెప్పడానికి స్కిల్ స్కామ్‌లో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యబద్దంగా పరిపాలన జరుగుతోందనేది స్పష్టంగా తేలిందన్నారు. అవినీతి ఎవరు చేశారో.. నిరుద్యోగుల ట్రైనింగ్ పేరుతో రూ.371 కోట్ల ఏపీ ఖజానాకు కొల్లగొట్టిన ఘనుడు ఎవరో ప్రపంచానికి తెలిసిపోయిందన్నారు.