చంద్రబాబు అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండిస్తున్నట్లు చెప్పడాన్ని మంత్రి కాకాణి తప్పుబట్టారు. వారిద్దరికి ఒప్పందం కుదిరినట్లుంది అందుకే చంద్రబాబు అరెస్ట్ ను పురందేశ్వరి తప్పుబడుతున్నారని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ధనం దుర్వినియోగమైన పర్వాలేదని మీరు చెప్పదలుచుకున్నారా అని పురందేశ్వరి నిలదీశారు. రెండుసార్లు లోక్ సభ పోటీ చేసి పురందేశ్వరి ఓడిపోయారని అందుకే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో జతకట్టి పోటీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అందుకే చంద్రబాబును తీసుకొని బీజేపీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు పురందేశ్వరికి లేదని తేల్చి చెప్పారు.